calender_icon.png 1 January, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు

29-12-2024 04:14:03 PM

జుక్కల్ (విజయక్రాంతి): టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. వెలగనూరు శివారులో కారు టైరు పేలి రోడ్డు పక్కన గల డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.