calender_icon.png 24 November, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీటీఆర్‌ల సామర్థ్యం పెంచాలి

24-11-2024 02:52:08 AM

  1. వేసవిలో డిమాండ్‌కు తగినట్టు ఏర్పాట్లు 
  2. ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా వేసవిలో నమో దయ్యే విద్యుత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీలను విద్యుత్తు శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. శనివారం విద్యుత్తు సౌధలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

వేసవిలో నాణ్యమైన విద్యుత్తు నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం, గ్రేటర్‌లో 15 శాతం విద్యుత్తు డిమాండ్ అధికంగా నమోదయ్యిందన్నారు. వచ్చే ఏడాది వేసవి డిమాండ్‌ను అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈహెచ్‌టీ, 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో పీటీఆర్ సామర్థ్యం పెంచాలన్నారు.