* ఇళ్లలోకి చేరిన నీరు
* తడిసి ముద్దయిన సరుకులు
* హుటాహుటిన సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
మానకొండూరు, జనవరి 12: తోటపల్లి రిజర్వాయర్ లింక్ కెనాల్ డి-4 కాలువకు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం వద్ద ఆదివారం గండిపడడంతో ఆ గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి నీరు వచ్చి చేర డంతో ఇంట్లోనే ఉన్న వస్తువులన్ని తడిసి ముద్దయ్యాయి. కొన్ని వస్తువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
విషయం తెలుసుకున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుటా హుటిన ఆ గ్రామాన్ని సందర్శించారు. కాలు వకు గండిపడ్డ ప్రదేశాన్ని పరిశీలించారు. అందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి పలు ఇళ్లకు వెళ్లి పరిస్థితి ని స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లా డుతూ కాలువకు గండి వ్యవహారాన్ని ప్రభు త్వ పెద్దల దృష్టికి సంబంధిత ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
ప్రస్తుతం గండిపడ్డ ప్రదేశంలోనే గతంలో కూడా 2 పర్యాయాలు గండ్లు పడ్డాయని, ఇకముందు ఎలాంటి విపత్తు సంభవించ కుండా ఉండేందుకు శాశ్వత నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. ఒక్కసారిగా నీరు వచ్చి ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు అయోమయానికి గురి అయ్యారని, ఇళ్లల్లో వస్తువులు, ధాన్యం, ఆహార సరుకులు పూర్తిగా తడిచిపోయాయన్నారు.
కొంతమే రకు ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆయన చెప్పారు. బాధితులకు పరిహారంతోపాటు నిత్యవసర సరుకులు అందించేందుకు చర్య లు తీసుకుంటున్నామని, ఈ విషయమే ఇప్పటికే రెవెన్యూ ఉన్నతాధికారులతో మా ట్లాడినట్టు సత్యనారాయణ వివరించారు.
ఆరా తీసిన బండి
మన్నెంపల్లిలో వరద కాలువ గండిపడ డంతో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజ య్ జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇళ్లలోకి నీరు చేరడంతో వారి కి ఎలాంటి ఇబ్బందులు తరతకుండా వెంట నే సహచరులు చేపట్టాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, తిమ్మా పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్, పోతుగంటి శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్, కనకయ్య, కృష్ణ, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కిషన్, ఆంజనేయులు, కిరణ్ కుమార్ ఉన్నారు.