21-02-2025 12:29:22 AM
జగిత్యాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వింత పోకడలు సంతరించుకున్నది. ఓవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరోవైపు ఉపాధ్యాయుల ఎమ్మె ల్సీ స్థానానికి హోరాహోరీ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులతో పాటూ ‘సింహం సింగిల్’ అన్న చందంగా ఒంటరి పోరుకు దిగిన అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు.
అయితే ఈసారి కాస్త ఈ ప్రచారం ఆన్లున్లో ఫోన్’కే పరిమితమవడం గమనారం. ఒకరిద్దరు అభ్యర్థులు ప్రధాన కేంద్రాలలో ముఖ్య పట్టణాలలో చిన్నా చితక సమావేశాలు పెట్టి చేతులు దులుపుకున్నారు. పార్టీల బలంతో బరిలో నిలిచిన అభ్యర్థుల పరిస్థితి సైతం ఇంచుమించు అలాగే ఉందనవచ్చు. జిల్లా కేంద్రాల్లో తప్ప చాలాచోట్ల పార్టీ శ్రేణుల ప్రచారం కనిపించకపోవడం చర్చనీయమైంది.
ఇందుకు పార్టీలో ఉన్న అంతర్గత వర్గ విబేధాలు, నాయకత్వ పోరు, వ్యక్తిగత ప్రాధాన్యత సన్నగిల్లడం... వంటి ఇతరత్రా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ప్రచారంలో మాత్రం చెప్పుకోదగిన ప్రభావం కనిపించకపోవడం గమనా రం. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అభ్యర్థుల తీరు, పార్టీ శ్రేణుల పనితీరు మాత్రం ప్రభావం చూపడం లేద న్న వాదనలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి.
కరీంనగర్ - మెదక్ - అదిలాబాద్ - నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ స్థానాలకు జరుగుతు న్న ఎన్నిక కీలక దశకు చేరుకున్నట్లే. మరో వారం రో జుల్లో ఎన్నిక జరగనుండగా, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తప్ప నియోజకవర్గాల స్థాయిలో గానీ పట్టణ, మండల కేంద్రాల స్థాయిలో ప్రచార ప్రభావం అంతంత మాత్రమే అన్న విమర్శలున్నాయి.
పోటీలో ఉన్న అభ్యర్థులు కనిపించకపోగా, ఊహించిన స్థాయిలో ప్రచారం కూడా జరగకపో వడం విశేషం. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటూ ఇటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎంతసేపు సాంకేతికతను అడ్డుపెట్టుకొని మెసేజ్లు పెట్టడం, ‘నేను మీ....ను, ఈ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించండి’ అంటూ ఫోన్లో వాయిస్ ప్రచారం చేయడం పరిపాటయ్యింది.
కొందరు మరో అడుగు ముందుకేసి ఓటర్లకు ఫోన్లు చేయించి ‘మేము ఫలానా.. అభ్యర్థి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామండి, మీ మొదటి ప్రాధాన్యత ఓటు మా అభ్యర్థికే వేయండి’ అని ఆన్లున్, ఫోన్ లైన్ ప్రచారంతో సరిపెట్టుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా, ఒక్కో ఓటరుకు ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 వరకు ఫోన్ కాల్స్ రావడంతో పాటూ ప్రచారానికి సంబంధించిన మెసేజ్లు చూసి విసుగత్తి అసౌకర్యానికి గురవుతున్నారు.
కొందరు ఓటర్లకు అటు పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఓటరుగా, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా రెండు ఓట్లు ఉండడంతో ప్రతిరోజు ఉదయం మొదలు రాత్రి వరకు 20 నుండి 30 ఫోన్ కాల్స్‌తో వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది.
అడపాదడపా వస్తున్న ఫోన్ కాల్స్’లో ఏది తమకు అవసరమైన ఫోన్ కాలో, ఏది ప్రచారానికి సంబంధించిన ఫోన్ కాలో తెలియక విసుగెత్తుతున్నారు. మొత్తం మీద ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చెప్పుకోదగ్గ ప్రభావం చూపకుండా.. ఆన్లున్, ఫోన్ లైన్ ప్రచారానికే పరిమితమైందన్న వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.