పెద్దపల్లి (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష(Collector Koya Shriharsha) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గెజిటెడ్ అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను పాటిస్తూ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ జిల్లాకు రాష్ట్రంలో ఉన్నత స్థానం కల్పించాలని గెజిటెడ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షలు తూము రవీందర్, కార్యదర్శి లెంకల బ్రహ్మానంద రెడ్డి, సహా అద్యక్షులు అలివేని, కోశాధికారి కరుణాకర్, ఉపాధ్యక్షులు కుమార్, ఎండీ.సాజిద్ అలి, అంజని, కరుణాకర్, సంయుక్త కార్యదర్షులు శ్రీనివాస్, మధు, అనూష, అలేఖ్య, కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్, ప్రచార కార్యదర్శి శ్రీకాంత్, కార్యాలయ కార్యదర్శి శంకర్ యాదవ్, సాంస్కృతిక కార్యదర్శి తిరుమల్, క్రీడల కార్యదర్శి మధు బాబు, కార్యవర్గ సభ్యులు గంగ ప్రణవ్, సతీష్, రాఘవేంద్ర చారీ, సిందూరి, జిల్లా అధికారులు, అన్ని శాఖధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణలో పలువురు పాల్గొన్నారు.