calender_icon.png 26 March, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆసిఫాబాద్‌లో సినీ నటుల సందడి

24-03-2025 01:11:22 AM

  1. డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు కుమ్రంభీం జాతీయ అవార్డు ప్రదానం 
  2. పాల్గొన్న పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు, అధికారులు 

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 23(విజయక్రాంతి): జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అశువులు బాసిన అమర వీరుడు గిరిజనుల ఆరాధ్య దైవం కువ రంభీం జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా జరిగింది. భారత్ కల్చర్ అకాడమి.

ఓం సాయి తేజ ఆరట్స్, ఆదివాసి సంస్కృ పరిషత్ సంయుక్తంగా.గత 12 సంవత్సరాలుగా వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. 2024 సంవత్సరానికి గాను నటుడు సాయికుమార్ ను ఎంపిక చేసి పురష్కరాన్ని అందజేశారు.

జిల్లా కేంద్రంలోని  ప్రేమల గార్డెన్ లో  ఏర్పాటు చేసిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిర్వహణ కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారధి. విశిష్ట అతిధులుగా ఎంపి నగేష్, ఎమ్మలే కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్సీ డీవీ శ్రీనివాసరావు.. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్ష ,మాజీ మంత్రి బాబు మోహన్, హస్య నటుడు శివారెడ్డి, కుమరంబీం మనుమడు సోనేరావు, నిర్వహణ కమిటీ కో చైర్మన్ సురేష్ కుమార్, కన్వీనర్ అర్జు మాస్టారు.

యువ నిర్మాత నక్క రాహుల్ యాదవ్ పాల్గొని అవార్డు గ్రహీతను ఘనంగా సత్కరించి మెమోంటోను, రూ. 50వేల నగదు పరష్కరాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ చైర్మన్ పార్ధసారది మాట్లాడుతూ కుమరంభీం పోరాటాం స్పూర్తిదాయకమన్నారు. జల్ జంగల్ అమీన్ కోసం ఆదివాసి హక్కుల కోసం పోరాడిన ఆదివాసిల ఆరాధ్యదైవమన్నారు. తాను గతంలో ఆదిలాబాద్ జిల్లాలో పని చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవలన్నారు.

ఆదివానీలు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొని ముందు తరాలకు అందించాలన్నారు. జిల్లా అభిష్య ప్రతి ఒక్కరు నడుంబిగించలన్నారు. గత 12 సంవత్సరాలుగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి కుమరంభీం జాతీయ అవార్డును ఇవ్వడం జరుగుతుందన్నారు. 2024 సంవత్సరానికి గాను డైలగింగ్, నటుడు సాయికుమార్ కు ఆవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు అవార్డు గ్రహీత, నటుడు సాయికుమార్ మాట్లాడుతూ కుమ్రం భీం జాతీయ అవార్డును అందుకోవడం ఎంతో అనందంగా ఉందన్నారు.

ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్న జాతీయ అవార్డును అందుకోలేదని ఇప్పుడు జాతీయ అవార్డును అందుకోవడం సంతోపాన్నిచ్చిందన్నారు. ఆదివాసిల ఆత్మగౌరవానికి ప్రతీక కుమరంభీం అని అలాంటి అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిసున్నానన్నారు. ఎంపి నగేష్ మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మబందువు కుమరంభీం పెరిట ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి రుమరంభీం ఆవార్డును ప్రధానం చేయడం సంతోషంగా ఉందన్నారు. 

ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ అవార్డును ఆసిఫాబాద్ లో ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందని పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఇన్ని రోజులు నటులను సినిమాలలో చూసామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లా 50 శాతం అటవీ భూ భాగం ఉందని, పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిర్వహణ కమిటీ అవార్డు అందజేయడం అభినందనీయమన్నారు.

హన్యనటులు బాబు మోహన్, శివారెడ్డిలు మాట్లాడుతూ కళాకారులను గుర్తించి అవార్డులను అందజేయడం అభినందనీయమన్నారు. డైలగ్ కింగ్ సాయికుమార్  అవార్డు ప్రధానోత్సవాన్ని ఖచ్చితంగా చుడాలని ఇక్కడికి వచ్చినట్లు వారు పెర్కొన్నారు. ఈ సందర్బంగా హస్య నటుడు శివారెడ్డి చేసిన మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అంకంరాజు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుమరంభీం చౌక్ లోని భీం విగ్రాహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్ రావు, మల్లిఖార్జున్,  పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, నిర్వహణ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రామరావు, సాయిని రాజశేఖర్, రాధాకృష్ణచారి, ముప్ప చంద్ర శేఖర్ పాల్గొన్నారు.