- సెల్ఫీ వీడియోలో ధ్రువీకరించిన నిందితుడు
- లక్నోలో వెలుగు చూసిన ఘటన
లక్నో, జనవరి 1: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు పూటుగా మద్యం తాగి కన్నతల్లితో పాటు నలుగురు తోబుట్టువులను పొట్టనపెట్టుకున్నాడు. నిందితుడు ఓ వీడియోలో వెల్లడించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్నోకు చెందిన 24 ఏళ్ల అర్షద్ కుటుంబంతో కలిసి ఓ హోటల్‌లో ఉంటున్నాడు.
మంగళవారం పూటుగా మద్యం తాగిన అర్షద్ హోటల్‌కు వెళ్లాడు. తల్లి అస్మాతో పాటు నలుగురు సోదరీమణులను ఆహారంలో మత్తుమందు పెట్టి, ఐదుగురి చేతిమణికట్లు కోసి హతమార్చాడు. అనంతరం మృతదేహాలను ఉరివేసి వేలాడదీశాడు.
అందుకే చంపా: నిందితుడు అర్షద్
ఐదుగురిని హతమార్చిన తర్వాత నిందితుడు అర్షద్ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. “ఆగ్రాలోని తమ కు టుంబ ఆస్తిపై కొందరు కన్ను వేశారు. వారు తన సోదరీమణులను హైదరాబాద్‌లో విక్రయించాలని చూస్తున్నా రు. వారి ఉచ్చులో సోదరీమణులు పడొద్దనే ఉద్దేశంతోనే వారిని చంపా ను” అని వెల్లడించాడు.
మరోవైపు ఐదుగురి హత్య కేసులో అర్షద్ తండ్రి బదర్ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పరారీలో ఉన్న బదర్‌ను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.