calender_icon.png 6 November, 2024 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోయలో పడిన బస్సు

05-11-2024 01:08:10 AM

  1. 36 మంది మృతి
  2. ఉత్తరాఖండ్‌లోని అల్మారాలో విషాదం

డెహ్రాడూన్, నవంబర్ 4: ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో 36 మంది చనిపోయారు. 9 మందికి తీవ్రగాయాల య్యాయి. పౌరీ జిల్లాలోని నైనదండా నుంచి నైనిటాల్‌లోని రాంనగర్ వెళ్తున్న బస్సు అల్మోరా వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్ లోడ్ కార ణంగా కొండ ప్రాంతంలో అదుపుతప్పి బస్సు లోయలో పడి ఉంటు ందని పోలీసులు అనుమానిస్తున్నా రు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక చిన్న నది ప్రవహిస్తోంది.

ఘటనా ప్రదేశంలో పోలీసులే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆస్ప్రతికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కాగా ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర తరఫున ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలను పీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని మోదీ ప్రకటించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున అందజేస్తామని సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఘట న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ రవాణా అధికారిని సస్పెండ్ చేశారు. ఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.