calender_icon.png 30 October, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లుఓవర్ బ్రిడ్జి సైడ్ వాల్‌పైకి దూసుకెళ్లిన బస్సు

13-09-2024 12:27:11 AM

తప్పిన పెను ప్రమాదం

సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): జహీరాబాద్ పట్టణంలోని తాండూ ర్ రోడ్డుపై ఉన్న ఫ్లుఓవర్ బ్రిడ్జిపై ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు అదుపుతప్పి సైడ్ వాల్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలి లా ఉన్నాయి.. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ఉన్న పిరిమిల్ కంపెనీకి చెందిన కార్మికులను గురువారం మధ్యా హ్నం జహీరాబాద్‌లోని శివాలయం సమీప ప్రాంతం నుంచి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా, డ్రైవర్ అతివేగంతో బస్సు నడిపించడంతో పాటు బ్రిడ్జి పైకి రాగానే బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షు లు తెలిపారు. బస్సు బ్రిడ్జికి ఉన్న వాల్‌ను ఢీకొని నిలిచిపోయింది. డ్రైవ ర్ ఒక్కడే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది.