calender_icon.png 12 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమల బకాయిల భారం తడిసి మోపెడు

12-01-2025 01:12:39 AM

  1. 2016 నుంచి పేరుకుపోయిన ఇన్సెంటివ్, సబ్సిడీ నిధులు @రూ.4,250కోట్లు
  2. బకాయిల్లో మెజార్టీ వాటా ఎంఎస్‌ఎంఈలదే 
  3. బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యంతో పారిశ్రామికవేత్తల అవస్థలు
  4. దశలవారీగా బకాయిల చెల్లింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధం
  5. మొదటి విడత కింద రూ.1,000 కోట్లు!

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించడంపై రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆటోమొబైల్, ప్లాస్టిక్, ఫార్మాస్యూటికల్స్, ఏరోనాటికల్, రక్షణ, ఐటీ, ఐటీఈఎస్, పర్యాటకం, వినో దం వంటి రంగాల్లోని పరిశ్రమలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పెండింగ్ ఇన్సెంటివ్‌లు, సబ్సిడీ నిధులను విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు తొలి విడతగా రూ.1000 కోట్లను చెల్లించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశ్రమల శాఖ ఆర్థిక శాఖకు పంపినట్లు తెలిసింది. 2016 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ, ఇన్సెంటివ్ బకాయిలు రూ.4,250 కోట్లకు చేరుకున్నాయి.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడపాదడపా బకాయిలు చెల్లించినా.. ఎప్పు డూ పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. దీంతో  పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తర్వాత ఎంఎస్‌ఎంఈల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ప్రభు త్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలు రాక నష్టాలతో సంస్థలను నడపలేక కొందరు తమ కంపెనీలను మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎంఎస్‌ఎంఈలతో ఇతర భారీ పరిశ్రమల ఇబ్బందులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిల చెల్లింపు నకు రంగం సిద్ధం చేసింది.

15వేల ఎంఎస్‌ఎంఈలకు బాకీ

పరిశ్రమలు ప్రోత్సహించడానికి ప్రభు త్వం పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సాహకాలను ఇన్సెంటివ్‌లు, సబ్సిడీల రూపంలో అందిస్తుంది. విద్యుత్ ఛార్జీల్లో సబ్సిడీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, మూలధన రుణాలపై సబ్సడీ, వడ్డీ భారాన్ని తగ్గిం చడం, పరిశ్రమల కోసం భూమి కొనుగోళ్లు చేసినప్పుడు డీడ్‌లపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌కు అయ్యే మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్ వంటి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.

ఈ ప్రోత్సహకాల్లో మెజార్టీ లబ్ధిదా రులు ఎంఎస్‌ఎంఈలే కావడం గమవార్హం. ప్రభుత్వం బాకీపడిన రూ.4,250కోట్లలో మెజారీ వాటా ఎంఎస్‌ఎంఈలదే అని ప్రభు త్వ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 15 వేల ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం రూ. 3,100కోట్లు ఇన్సెంటివ్, సబ్సిడీలను చెల్లించాల్సిన ఉన్నట్లు సమాచారం.

మిగతా రూ. 1,125 కోట్లు మిగతా పరిశ్రమలు బాకీ ఉన్న ట్లు తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లుగా వేలాది కంపెనీలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాల కోసం వేయికళ్లతో వేచి చూస్తుండగా.. ఎంఎస్‌ఎంఈల యజమానుల నిరీక్షణకు తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇప్పుడున్న బకాయిలు చెల్లిస్తేనే.. కొత్త కంపెనీలు! 

దేశంలోనే ఎంఎస్‌ఎంఈ పాలసీని ప్రకటించిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పాటు సామాజిక , ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలక భూమి క పోషిస్తున్నాయి. అమెరికాలో కొత్తగా ఉద్యోగం పొందుతున్నవారిలో 80 శాతం మందికి ఎంఎస్‌ఎంఈలే ఉపాధిని కల్పిస్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా వాటికి ఎంత టి ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.

ఎంఎస్‌ఎంఈలే విశిష్ఠతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పాలసీ ని తీసుకొచ్చింది. అయితే పాలసీని తసుకొచ్చిన ప్రభుత్వానికి దాన్ని పకడ్బందీగా అమ లు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడున్న సంస్థలకు బకాయిలు చెల్లించడం వల్ల.. కొత్త గా ఎంఎస్‌ఎంఈలు రావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎంఎస్‌ఎంఈలు భారీఎత్తున రావాలంటే.. ఇప్పు డున్న వాటికి అండగా నిలిస్తే.. భవిష్యత్‌లో మరిన్ని రావడానికి ఆస్కారం ఉంటుదని సీఐఐ, ఎఫ్‌టీసీసీఐ లాంటి వాణిజ్య సంస్థ లు ప్రభుత్వానికి సూచించాయి. దీంతో సర్కారు ఆ దిశగా ఆలోచించి పెండింగ్ ఇన్సెంటివ్‌ల విడుదలకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.