calender_icon.png 16 April, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

76 వేలు దాటిన సెన్సెక్స్

15-04-2025 11:26:52 PM

బీఎస్‌ఈలో 1500, నిఫ్టీలో 500 పాయింట్ల లాభం

ముంబై: భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగింది. వివిధ దేశాలపై టారిఫ్‌లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు లాభపడ్డాయి. మంగళవారం బీఎస్‌సీ సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా లాభ పడగా.. నిఫ్టీ 500 పాయింట్లు పైకెగసింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ మళ్లీ 76 వేల మార్క్‌ని దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 76, 852.06 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75, 157.26) లాభాల్లో ప్రారంభమైంది.

ఇంట్రాడేలో 76,907.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1577. 63 పాయింట్ల లాభంతో 76,734.89 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 500 పాయింట్లు లాభపడి 23, 328.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.77గా ఉంది. సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ఇండియన్ రెన్యుబుల్, మార్కోటెక్ డెవలపర్స్, మదర్సన్ షేర్లు లాభాలు చూడగా.. మాక్స్ హెల్త్‌కేర్, పీఎన్‌బీ హౌసింగ్, హిందుస్తాన్ పెట్రో, బెర్గర్ పెయింట్స్ షేర్లు స్వల్ప నష్టాలు చవిచూశాయి.