జైరాంరమేశ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ఆరోపణలు గుప్పించారు. ‘మంత్రి మాట్లాడుతూ.. వ్యవసా యం, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు అనే నాలుగు ఇంజిన్లు అభివృద్ధికి శక్తి యంత్రాలుగా పని చేస్తాయని ప్రకటించారు.
కానీ చాలా మట్టుకు ఇంజిన్లు ఉన్న బడ్జెట్ రైలు పట్టాలు తప్పింది. బీహార్ రాష్ట్రానికి మాత్రమే కేంద్రం బొనాంజా ప్రకటించింది. మన్మోహన్ సింగ్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలు కోరుకున్న న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌ను బీజేపీ దెబ్బతీసింది’ అని ఎక్స్‌లో ఆరోపణలు గుప్పించారు.