calender_icon.png 10 January, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ పక్కాగా రూపొందించాలి

09-01-2025 01:10:28 AM

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై సమీక్ష

వనపర్తి, జనవరి 8 ( విజయక్రాంతి ) : 2025- సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ బడ్జెట్ పక్కాగా రూపొందిం చాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశిం చారు. బుధవారం ఉదయం కలక్టరేట్ కాన్ఫ రెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపల్ అధికారులు, అకౌంట్స్ ఆఫీస ర్లతో బడ్జెట్ ప్రతిపాదనల తయారిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో రూపొందించిన బడ్జెట్ ప్రతి పాదనలు, వసూలు చేసిన ట్యాక్సులు, ఖర్చు చేసిన నిధులపై ఒక్కో మున్సిపాలిటీ వారీగా సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణ అభి వృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్య కార్యక్ర మాలు బాగా చేసేందుకు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్,   ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ మొద లగునవి పకడ్బందీగా వసూలు చేయాలని ఆదేశించారు. 

కొత్తగా ఇళ్ళు నిర్మించుకున్న  గృహాలను ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసి ట్యాక్స్ వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.  ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ అధికంగా ఉన్నవారికి నోటీస్ జారీ చేసి  పెనాల్టితో పాటు ట్యాక్స్ వసూలు చే యాలని ఆదేశించారు.  బిల్డింగ్ రెనోవేశన్, అదనపు ఫ్లోర్ కట్టుకున్న ఇళ్లను గుర్తించి ఎసెస్మెంట్ రివైజ్ చేయాలని సూచించారు.

కొత్త బడ్జెట్ లో పారిశుద్యానికి  వాహనాలు కొనుగోలు చేయటం, విద్యుత్ బిల్లులు చె ల్లించడం వంటివి చేయాలని సూచించారు . మొత్తం సంపాదనలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించి మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఆదేశించారు. మొక్క లు పెంచటంలో నిధులు సరిగ్గా ఖర్చు చేయ డం లేదని, ఈసారి ఖచ్చితంగా ఖర్చు చేసి జిల్లాను హరితవనంగా  మార్చాలని ఆదేశిం చారు. బడ్జెట్ ప్రతిపాదనలు సి.డి.యం. ఏ ఇచ్చిన ప్రోఫార్మాలోనే రూపొందించాలని ఆదేశించారు. 

కొత్తగా మున్సిపాలిటీల్లో కలి సిన గ్రామాల్లో నిబంధనల ప్రకారం నిధులు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు శస్త్ర చికిత్సలు చేయించే విధంగా  పకడ్బం దీగా చర్యలు తీసుకోవాలని అందుకు నిధు లు కేటాయించాలని ఆదేశించారు. అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్ని మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లు, డి. ఈ లు, అకౌంట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.