calender_icon.png 13 March, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో విద్యారంగానికి 15% నిధులు

13-03-2025 01:36:05 AM

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు డిమాండ్

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ర్ట బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధికనిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సవతి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు.

గతేడాది బడ్జెట్‌లో విద్యా రంగానికి కేవలం 7 శాతం నిధులే కేటాయించిందని గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం బడ్జెట్‌లో విద్యా రంగానికి 12 నుంచి 13 శాతం నిధులు కేటాయిస్తుంటే మన రాష్ర్టంలో మాత్రం తక్కువ నిధులివ్వడం సిగ్గుచేటన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వర్సిటీలకు నిధులు, బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.