calender_icon.png 24 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాయక ప్రజలపై జరిగిన పాశవిక దాడిని ముక్తకంఠంతో ఖండించాలి

24-04-2025 05:34:14 PM

జమ్మూ-కాశ్మిర్ ప్రజలకు భారత పౌరసమాజం అండగా ఉంటుంది..

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జమ్మూ-కాశ్మిర్ పహల్గామ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిగిన పాశవిక, పైశాచిక దాడి, మారణహోమం అమానవీయమని, ఈ దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ కండిస్తుందని ఆ పార్టీ  జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. పట్టణ పరిధిలోని రామవరం ఆటో అడ్డాలో గురువారం జరిగిన కార్మికుల సమావేశం సందర్బంగా ఉగ్రదాడిలో మృతి చెందినవారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ... ఉగ్రవాదులు దేశపౌరులపై కాల్పులు జరిపి హత్య చేయడం అనాగరిక చర్యని ఈ దాడిని యావత్ భారత పౌరసమాజం ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

ఉగ్రవాదులు కేవలం హిందువులని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపడం దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకేనని స్పష్టమవుతోందన్నారు. ఇది ముమ్మాటికీ పిరికిపంద ఛెర్యేనని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు రేపి దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి దుచర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  కొద్ది రోజులక్రితం పాక్ ఆర్మిచిఎఫ్ అదేవిధంగా ఉగ్ర లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ పరోక్షంగా హెచ్చరించినా కేంద్రం నిర్లక్ష్యం చేయడంవల్ల ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు.

జరిగిన ఉగ్రదాడి ఇంటిలిజెన్స్ వైఫల్యమా, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమా కేంద్రమే తేల్చుకొని,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చెర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లు, మేడే ఉత్సవాలపై చర్చించారు. సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కంచర్ల జమలయ్య, మర్రి కృష్ణ, జలీల్, శ్రీనివాస్, హాబీబి, రాఫ్ఫ్య్, ఆనందరావు, జంజర్ల శివ, బాషా, నాగుల్ మీరా, గుబ్బల శ్రీను, యూసుఫ్, జానీ, రవీందర్, సలీం, జిలాని, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.