* సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే చంపినోడే సంతా ప సభ పెట్టినట్టు ఉందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి విమర్శిం చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులను పట్టించుకుని వారు.. కాంగ్రె స్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లడుతూ.. బీఆర్‌ఎస్ వేసిన రైతు కమిటీ రైతు సంక్షేమం కోసం కాదని, రాజకీయాల కోసమే వేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం ఎదుటే ఆదిలాబాద్ జిల్లా రైతు కరెంట్ పోలుకు ఉరేసుకొని చనిపోయిన ఘటనను గుర్తు చేశారు.