- హాకీలో కాంస్యం నెగ్గిన హర్మన్‌ప్రీత్ సేన
- భారత్ ఖాతాలో నాలుగో పతకం
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం వచ్చి చేరింది. మూడు పతకాలు వచ్చి వారం కావొస్తుండడంతో మరో పతకం వస్తుందా రాదా అన్న సంశయంలో ఉన్న యావత్ భారతానికి ఈ పతకం ఊపిరి తీసుకొచ్చింది. వినేశ్‌పై అనర్హత వేటుతో పతకం చేజారిన బాధలో ఉన్న కోట్లాది భారతీయులకు మన హాకీ జట్టు తీసుకొచ్చిన పతకం ఊరటను కలిగించింది. గతాన్ని గుర్తుచేస్తూ హర్మన్‌ప్రీత్ సేన కాంస్య పతకంతో మెరిసింది. ఫైనల్ అడుగు చేరడంలో విఫలమైనప్పటికీ భారత హాకీ జట్టు కీలకమైన కాంస్య పతక పోరులో గర్జించింది. స్పెయిన్‌ను ఓడించి వరుసగా రెండో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత్ విశ్వక్రీడల్లో జాతీయ జెండా రెపరెపలాడించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం గెలుచు కుంది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (ఆట 30వ, 33వ నిమిషంలో) గోల్స్ సాధించగా.. స్పెయిన్ తరఫున మార్క్ (18వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. మంగళవారం జరిగిన సెమీస్ పోరులో జర్మనీ చేతిలో ఓడిన హర్మన్ సేన తృటిలో ఫైనల్లో అడుగుపెట్టే చాన్స్ మిస్ చేసుకుంది. అయితే గురువారం జరిగిన కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టింది.
అడ్డుగోడలా శ్రీజేశ్
మ్యాచ్‌లో గోల్ కీపర్ శ్రీజేశ్ మరోసారి రియల్ హీరోగా నిలిచాడు. భారత ఆటగాళ్ల తప్పిదాల వల్ల స్పెయిన్‌కు 9 సార్లు పెనాల్టీ కార్నర్‌లు వచ్చాయి. కానీ ఒక్కసారి గోల్ కొట్టలేకపోయిందంటే దానికి కారణం శ్రీజేశ్ అడ్డుగోడలా నిలవడమే. శ్రీజేశ్‌తో పాటు భారత డిఫెన్స్ కూడా సమర్థపాత్ర పోషించింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటిం చాడు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే శ్రీజేశ్ తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భార త్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించడం విశేషం. భారత హాకీ జట్టు వరుస ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నిలబెట్టుకోవడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి . గతంలో ౧౯౬౨ ఒలింపిక్స్‌లో ఈ ఫీట్ సాధించింది.