calender_icon.png 19 October, 2024 | 1:10 PM

మార్కెట్‌లో దళారీ వ్యవస్థను అరికట్టాలి

19-10-2024 12:08:51 AM

గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి 

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 18: కూరగాయల మార్కెట్‌లో దళారుల వ్యవస్థను అరికట్టాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ నగర్‌లోని కూరగాయల మార్కెట్‌ను పాలకవర్గంతో కలిసి సందర్శించారు. రైతులు, వర్తకులు, హోల్‌సేల్ వ్యాపారులు, వినియోగదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్‌కి వచ్చిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ధరలు అందు బాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చా రు.

రైతులను, వ్యాపారులను, వినియోగదారులను, అధికారులను సమ న్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మార్కెట్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డి, మార్కెట్ ఉద్యోగులు, హమాలీలు కలిసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, డైరెక్టర్లు నవరాజ్, జైపాల్‌రెడ్డి, బండి మధుసూదన్‌రావు, ముచ్చేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, నరసింహ, గణేష్ నాయక్, గోవర్దన్‌రెడ్డి, అంజయ్య, వెంకట్ గుప్తా, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ నగర్ మార్కెట్ కార్యదర్శి ఎండీ వహీద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.