కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థను నిర్మూలించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుసన్న రాజన్న డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో కలిసి కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో కొంతమంది దళారుల అవతారం ఎత్తి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దళారులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని తెలిపారు. రైతులు తీసుకువచ్చిన పత్తికి తేమ సాకు చూపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా నాయకులు ముంజం ఆనంద్, గొడిసెల కార్తీక్ తదితరులున్నారు.