19-03-2025 04:58:06 PM
సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ..
పెన్ పహాడ్: సాయుధ తెలంగాణ పోరాట వీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆశయ సాధనలో పయనించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా లింగాల గ్రామంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం వర్ధంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. భూమి కోసం భుక్తి కోసం పేదల విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడిన యోధురాలు కామ్రేడ్ స్వరాజ్యమన్నారు. స్వరాజ్యం ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ ఎర్రజెండా ద్వారానే సమాజ మార్పు జరుగుతుందని ఆశించి ఒక పక్క తుపాకి.. మరో పక్క ఎర్ర జెండా పట్టుకుని సాయూద దళాలను ఏర్పాటు చేసి విరోచితమైన పోరాటాన్ని చేసి తన కుటుంబాన్ని పార్టీకి అంకితం చేసిన మహా యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యమన్నారు.
రైతన్న సమస్యలపైన మహిళల సమస్యలపై అనేక వీరోచిత పోరాటాలు చేసి పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహా యోధురాలు అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ పక్షాన అనేకమైన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి రణపంగ బుచ్చిరాములు, డివైఎఫ్ఐ మండల నాయకులు రణపంగ అనిల్, లొడంగి మధు, దేవయ్య ఐద్వా నాయకురాలు సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.