24-03-2025 01:32:36 AM
సూర్యాపేట, మార్చి 23: నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన విధానాన్ని సహించ లేక, ప్రజలు అనుభవిస్తున్న దీనస్థితికి చలించిపోయి సాక్ష్యాత్తు పార్లమెంటులోనే బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశీలి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నేటి యువత ఉద్యమ స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పిలుపునిచ్చారు.
ఆదివారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ నాయకులు, వీరబోయిన లింగయ్య, రామకృష్ణ పి.డి.ఎస్.యు నాయకురాలు సంధ్య, మహేశ్వరి, నవ్య, పావని, మానస, మనీషా, శైలజ, అఖిల, లావణ్య పాల్గొన్నారు.