calender_icon.png 22 October, 2024 | 9:53 AM

ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండ్ ఇమేజ్ పెంచాలి

22-10-2024 01:36:12 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైద్యులు పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రుల పనితీరుపై సోమవారం సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లా డుతూ ప్రజలకు సర్కార్ ఆసుపత్రులపై మరింత నమ్మకం, భరోసా కల్పిం చేలా పని విధానం ఉండాలని సూ చించారు. ఆసుపత్రుల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలన్నారు. అవసరమైన వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు, ఆసుపత్రుల పనితీరును కూడా సమీక్ష  చేస్తామని, రోగు లకు ఇబ్బంది కలిగిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు.

సానిటేషన్, సె క్యూరిటీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఎక్కడైనా పరిశుభ్రత సక్రమంగా లేకుంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిం చారు. పరికరాల మరమ్మతులు ఉం టే వెంటనే బాగు చేయించాలని, రిపేర్ల సాకుతో రోగులకు బయటకు సిఫారసు చేయవద్దని పేర్కొన్నారు.