06-03-2025 12:59:01 AM
శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు
భక్తుల హరి నామ కీర్తనలు, భజనలు, వేదాంతాలు, కూచిపూడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఎటు చూసినా యాదగిరి కొండ వైకుంఠధామమే
యాదాద్రి భువనగిరి, మార్చి 5 ( విజయక్రాంతి): అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు “నబూ తో”న భవిష్యత్తు”, తరహాలో జిగేలు మనీ లైట్ల మధ్య యాదగిరి కొండ మెరిసిపోతూ భక్తులను మై మర్పిస్తుంది. ఇటీవలనే 68 కిలోల బంగారంతో స్వామివారికి చేయించిన స్వర్ణ విమాన గోపురం 10 కిలోమీటర్ల వరకు దగ దగ మెరుస్తూ స్వర్ణ కాంతులతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
ఇది మన యాదగిరిగుట్టెన లేక శ్రీ మహా విష్ణు వైకుంఠపురమా అనే విధంగా మెరుస్తోంది. ఒక్క సారి అయినా స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసి తరించి పోవాలి అనే భావన భక్తుల్లో కలుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుండి రోజురో జుకు భక్తజనం తిరుగుతూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన బుధవారం నాడు ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు చేసిన అనంతరం శ్రీ స్వామి వారిని శ్రీకృష్ణ అలంకరణం (మురళీకృష్ణుడు) సేవగా అలంకరించి ప్ర ధాన అర్చకులు, పారాయనీకులు, యజ్ఞచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, అత్యంత వైభవంగా ఆలయ తిరువీధులలో ఊరేగించారు. శ్రీకృష్ణ అవతారంలో మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన స్వామివారిని కనులారా చూసిన భక్తజనం తన్మయం చెం దారు. ఓ నారాయణ ఏ రూపం చూసిన ను వ్వే కదా ఈ భక్త జనాన్ని కాపాడు నరసింహ అంటూ భక్తులు స్వామిని వేడుకున్నారు.
శ్రీకృష్ణ అలంకారము (మురళీకృష్ణుడు) ప్రత్యేకత
భగవానుడు శ్రీకృష్ణ అవతారంలో మురళీకృష్ణుడిగా తన దివ్యమైన వేణు గానంతో సమస్త ప్రాణకోటికి చైతన్యాన్ని జ్ఞానాన్ని, ముక్తిని అందించిన విలక్షణమైన తత్వముగా భాగవతంలో సూచించబడినదని పండితులు, ప్రధాన అర్చకులు వివరించారు. మురళీకృష్ణుడు బృందావనంలోని ఆబాల గోపాలాన్ని సమస్త ప్రకృతి మండలమును తన వేణు గానంతో పరవశింప చేశాడని, వేణువు నుండి వెలువడే నాదమే ప్రణవ నాదమని ఆ నాధ శ్రవణం పరమాత్మ అనుగ్రహమునకు ప్రథమ సోపానమని వల్లభాచార్యుల వారు స్తుతించారని వివరించారు.
శ్రీ స్వామివారు మురళీకృష్ణ అలం కారంలో తన రమణీయమైన సౌందర్యా తీసియమును, దర్శింప చేస్తూ సమస్త ప్రాణకోటిని తన వైపు ఆకర్షించుకొనుచు భక్తులను అనుగ్రహించుట ఎంతో విశేషమై ఉన్నదని వేద పండితులు వివరించారు.
పొన్న వాహన సేవలో స్వామివారు
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని సాయంత్రం ఉన్న వాహన సేవలో అలంకరించి తిరువీధులలో ఆలయ ప్రధాన అర్చ కులు అర్చకులు అజ్ఞాచార్యులు వైభవంగా ఊరేగింపు వేడుకలు నిర్వహించారు.
వాహన సేవ ప్రత్యేకత
బ్రహ్మోత్సవాలలో శ్రీ పాంచరాత్రాగమ సాంప్రదాయంతో పొన్న ( కల్పవృక్ష ) వాహన సేవకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. భగవత్ విభూతి విశేషంగా వ్యక్తమయే పక్షులు, వృక్షాలు, జంతువులు, పదార్థాలు, అన్ని ఆయన్ను వహించి సేవలందిస్తూ ఉంటా యి. కావున స్వామి వారిని పొన్న వాహనంపై ఊరేగించెదరు. కోరిన వాటిని కల్పించి ఇవ్వగల మైమ గలది కాబట్టి ఇది కల్పవృక్షము.
వైదేహి సైతం సురద్దుర్ మాత లేమై మహా మంటపే అని స్వామివారి గురించి ధ్యాన శ్లోకంలో స్తుతించినట్లుగా కల్పవృక్షానికి అవినాభావ సంబంధం ఉంది. తనను ఆశ్రయించిన భక్తుల పాలిట కల్పతరువు భగవానుడు. శ్రీ స్వామి వారు ఇహపర ఆనందదాయకుడై భక్తులను సౌరక్షిస్తూ పొన్న సహనా రూడుడై భక్తులకు దర్శన భాగ్యం కలిగించుట ఎంతో ప్రత్యేకమైనదని ప్రధానార్చకులు వివరించారు.
ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత, మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఈ కార్యక్రమాలు హాజరై విజయవంతం చేస్తున్నారు. శ్రీ విశ్వ ఆంజనేయ భక్త సమాజం కార్వాన్, శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, శివరామకృష్ణ భజన మండలి వేలుపల్లి వార్లు భజన కార్యక్రమాలు చూడముచ్చటగా నిర్వహించారు. మంగళ వాయిద్యాన్ని ఆస్థానం వారు నిర్వహించారు. వైదిక ప్రార్థన ఆస్థానం వారు డాక్టర్ మసన చిన్నప్ప హైదరాబాద్ వారు ఉపన్యసించారు.
చేబ్రోలు నారాయణదాసు సుభద్ర పరిణామం అనే హరికథను గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ అకాడమీ వారు భక్తి సంగీతాన్ని నిర్వహించారు. మెరుగు రాఘవేంద్ర తబలా వాద్యాన్ని వాయించారు. స్వామి వారు తిరువీధులలో ఊరేగింపు జరిగిన కార్యక్రమాల్లో ఆలయ అర్చకులతో పాటు ఆలయ ఈవో భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి భక్తులు పాల్గొన్నారు.