26-04-2025 12:00:00 AM
రేవనాలు పుస్తకావిష్కరణ సభలో పలువురు వక్తలు
ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి మీద ఎక్కుపెట్టిన బ్ర హ్మాస్త్రం ’రేవనాలు’ పుస్తకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వనాథుల పుష్పగిరి రాసిన కవిత్వ పుస్తకం రేవనాలు ఆవిష్కరణ కార్యక్రమం నీలం వెంకన్న సభాధ్యక్షత జరిగింది. ప్రముఖ కవి, విమర్శకులు, డా.అంబటి సు రేంద్రరాజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మా ట్లాడారు. ఈ రేవనాలు పుస్తకంలో రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను రచయిత కొన్ని చోట్ల అతి తీవ్రస్థాయిలో విమర్శ చేశారన్నారు. ఆనాడు వ్యతిరేకించిన ఫా ర్మాసిటీయే రూపం మార్చుకొని ఫ్యూచర్ సిటీగా వచ్చిందన్నారు. ఈ పుస్తకాన్ని ముప్పుమైడు జిల్లాల్లో ఆవిష్కరిం చాలని ప్రతి జిల్లాకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం ముఖ్య అతిధి, సహజ కవి, ఫార్మా సిటీ బాధిత రైతు నారాయణ దాసు మాట్లాడుతూ తాము ఏవైతే బాధలు అనుభవిస్తున్నామో అవే అంశాలను సరిగ్గా కవిత్వీకరించడం గొప్ప విషయ మని, తమ పక్షాన ప్రభుత్వంపై తిరుగుబాటు కవిత్వం రాసిన పుష్పగిరికి ధన్యవా దాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పక్షాన ఫార్మా సిటీపైన మాట్లాడిన మేధావులు కవులు రచయితలు ఇప్పుడేమ య్యారని, అవే భూముల్ని లాక్కొని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించి తమను నిర్వాసితులను చేయాలని చూస్తోందని అన్నారు.
పుస్తక రచయిత విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ ప్రజలు అనుభవిస్తున్న దుఃఖంలోనుంచే ఈ కవిత్వం వచ్చిందని, ఇందులో రాసిన ప్రతి అక్షరం ప్రజల నాలుకల మీద నుంచి వచ్చిందనే అన్ని అన్నారు. ఇది ఇక్కడితో ఆగదని హిందీ, ఇంగ్లీష్ లోకి అనువదించి డిల్లీ జన్ పథ్ వీధుల్లో ఆవిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ రమేష్, నరేష్ కుమార్ సూఫీ, ఇంద్రపాల శ్రీనివాస్, మోహన్ బైరాగి, డప్పు స్వామి, ఎం.ఎస్.నాయుడు, తంగెళ్లపల్లి కనకాచారి, రాజబాపు, జంపాల ప్రవీణ్, వెంకట కిశోర్, ప్రభాకరాచారి, సల్వాచారి, వాణి, కార్తీక్, నరేష్ పాల్గొన్నారు.