calender_icon.png 23 January, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నెండు గంటల్లోనే బాలుడు అప్పగింత...

23-01-2025 07:29:52 PM

బైంసా (విజయక్రాంతి): ఫిర్యాదు అందిన 12 గంటల్లోపే బాలుడి ఆచూకిని గుర్తించిన పోలీసులు తండ్రికి సురక్షితంగా అప్పగించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపిఎస్ భైంసా క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉండటం తెలుసుకుని కుబీర్ మండల నుంచి తన 18 ఏళ్ళ కుమారుడు తప్పిపోయాడు అని ఎస్పీకి నేరుగా ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే స్పందించిన ఎస్పీ తప్పిపోయిన పిల్లగాని ఆచూకీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని ASP Bhainsa అవినాశ్ కుమార్ ఐపీఎస్ ను ఆదేశించారు. జిల్లాలో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అదృశ్యం అయిన 12 గంటలలోపే మహారాష్ట్ర బార్డర్ లో సంచరిస్తున్న అతన్ని వెతికి పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. బాలుడి ఆచూకీ గుర్తింపులో తోడ్పడిన కుబీర్ ఎస్ఐ రవీందర్ టీంనీ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపీఎస్ ప్రశంసించారు.