బైంసా (విజయక్రాంతి): ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలుడిని భైంసా పోలీసులు పట్టుకొని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... మాటేం గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు బుధవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయి బైంసా బస్టాండ్ లో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కస్తి తిరుగుతున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుని పట్టుకుని విచారించగా తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు బాలుడికి నచ్చజెప్పి గురువారం ఉదయం తల్లిదండ్రులకు అప్పగించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు.