వికారాబా ద్, జనవరి 2 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో వరుస మిస్సింగ్‌లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఏడాది బాలుడి అపహరణ, తల్లీకొడుకు అదృశ్యం ఘటన మరువకముందే.. తాజాగా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాం డూరుకు చెందిన 14 ఏళ్ల బాలుడు బుధవారం రాత్రి ఇంటి పక్కనే ఉన్న మసీదులో నమాజ్ చేసి వస్తానని చెప్పిన సమీర్ రాత్రయినా ఇంటికి రాలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంతవెతికినా సమీర్ ఆచూకీ లభించలేదు. దీంతో సమీర్ తల్లిదండ్రులు గురువారం తాండూ రు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.