కామారెడ్డి జిల్లా వడ్డెపల్లిలో ఘటన...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం వడ్డెపల్లిలో కాలువలో జారీ పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానిక ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన సందీప్(14) అనే బాలుడు అదే గ్రామానికి చెందిన స్వామి అనే రైతుతో కలిసి పోలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న నాగమడుగు ఎత్తిపోతల కాల్వలో జారిపడ్డాడు. గమనించిన స్వామి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి కాల్వలోని సందీప్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రాజెక్ట్ వద్ద ఎలాంటి హెచ్చరికలు బోర్డు లేకపోవడంతో బాలుడు జారిపడి మృతిచెందాడని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలుని తల్లి బాలమణి పిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.