calender_icon.png 20 January, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొట్లు పాయే.. బాటిళ్లు వచ్చే

20-01-2025 12:00:00 AM

కోనరావుపేట, జనవరి 19: ప్లాస్టిక్ భూతం  కల్లుకుండలను సైతం తాకింది.పల్లెల్లో స్వచ్ఛమైన కల్లు తాగడానికి మట్టి తో తయారు చేసిన కుండలను ఉపయోగించేవారు.కాలక్రమేణా మట్టి కుండల తయారీ కనుమరుగు కావడం, వాటి ధర లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో గీత కార్మికులు  ప్లాస్టిక్ బాటిళ్ల వైపు చూస్తున్నారు.

కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం లో పొద్దాడి కల్లు తీయడానికి ఇలా తాటి చెట్టు వాటర్ బాటిళ్ళు కట్టారు. కాగా ఆటు వైపు వెళుతున్న వారు తాటి చెట్టు వైపు ఆసక్తి గా చూస్తున్నారు. ప్లాస్టిక్ బాటల్లో కల్లు తీయడంతో కల్లు ప్రియులు వాపోతున్నారు.