calender_icon.png 9 January, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాభర్తల బంధం ఆ అలవాట్లతో పదిలం

13-08-2024 12:00:00 AM

వ్యక్తిగత లక్ష్యాలు ఎంత ముఖ్యమో.. లైఫ్ పార్ట్ నర్ అంతకంటే ముఖ్యం. అయితే బిజీ లైఫ్ కారణంగా భార్యాభర్తల బంధం బలహీనంగా మారుతుంది. ఎంత బిజీగా ఉన్నా సరే ప్రేమగా మాట్లాడుకుంటే వైవాహిక బంధం బాగుంటుంది. ముఖ్యంగా బెడ్ టైంలో చేసే చిన్న చిన్న తప్పులే దంపతుల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. 

మనిషి జీవితంలోకి స్మార్ట్‌ఫోన్ ఎంటర్ అయ్యాకా బంధాలు.. అనుబంధాలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. చాలా జంటలు రాత్రివేళలో స్మార్ట్ ఫోన్ వాడుతూ అన్యోన్యతను దూరం చేసుకుంటున్నారు. అయితే మంచి బెడ్ అలవాట్లు జంటల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందిస్తాయి. అంతేకాదు... శారీరకంగా, మానసిక సాన్నిహిత్యంపై ప్రభావితం చేస్తాయి. అందుకే నిద్రపోయే వేళ స్మార్ట్‌ఫోన్లను దూరం పెడితే బంధం మరింత బలపడుతుందం టున్నారు డాక్టర్లు.

రాత్రివేళ ప్రియమైన భాగస్వామిని కౌగిలించుకోవడం.. ప్రేమగా ముద్దులు పెట్టడం..  హగ్ చేసుకోవడం వల్ల  ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజై మంచి రిలేషన్ కు దారితీస్తుందని ఢిల్లీకి చెందిన రిలేషన్షిప్ కౌన్సెలర్ రుచి చెప్పారు. ఏకాంత సమయంలో అనవసర విషయాలు పక్కనపెట్టి చక్కని సంభాషణతో నిద్రకు ఉపక్రమిస్తే జంటల మధ్య నమ్మకం ఏర్పడి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అంతేకాదు.. సానుకూల నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఇదే విషయమై గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ సైకాలజిస్ట్ మీమాన్సా సింగ్ తన్వర్ రియాక్ట్ అవుతూ.. భార్యాభర్తలు నిద్రపోయే ముందు జంటలు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది అని అన్నారు. 

* బెడ్ టైంలో మంచి అలవాట్లు కలిగి ఉంటే కచ్చితంగా లైఫ్ పార్ట్ నర్‌కు మరింత దగ్గరయ్యేలా చేస్తాయి. రాత్రి వేళలో చెప్పే గుసగుసలు.. చిలిపి చేష్టలు పదిలమైన బంధంవైపునకు తీసుకెళ్లుతాయి. మంచి అలవాట్లతో ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి సహాయపడతాయి. నెగిటివ్ ఆలోచనలు, అపార్థాలు, అశాంతి లాంటికి వాటికి దూరంగా ఉండేలా చేస్తుంది. 

* బెడ్ టైంలో టీవి చూడటం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం.. ల్యాప్ టాప్ తో వర్క్ చేయడం లాంటివి జంటల మధ్య కమ్యూనికేషన్‌ను దూరంచేస్తాయి. ఇద్దరి బాండింగ్ పై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు.. స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ కూడా ప్రభావితం చేస్తుంది. దాంతో ఆందోళన వంటి లక్షణాలు దరిచేరుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే కొందరు త్వరగా నిద్రపోతే.. మరికొందరు మేల్కొని ఉంటారు. ఈ అలవాటు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతిజంట బెడ్ టైంలో బెస్ట్ హ్యాబిట్స్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు రీసెర్చర్స్.

* వ్యక్తిగత అలవాట్లు కూడా భార్యభర్తలను దూరం చేస్తాయి. గురక అలవాటు ఉండే వ్యక్తులు కచ్చితంగా ఇతర ప్రదేశాల్లో నిద్రపోయేందుకు ఇష్టం చూపుతారు. ఈ అలవాటు కూడా శారీరక సాన్నిహిత్యం, సన్నిహిత సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక పిల్లలు ఉన్న జంటల మధ్య అంతరం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లలను పడుకోబెట్టే సమయంలో సమన్వయం చేసుకోవాలి. అయితే కొన్ని జంటలు విడివిడిగా పడుకుంటేనే హాయిగా నిద్రపోగలుగుతారు. కానీ ఆ అలవాటు ఇద్దరి బంధంపై ప్రభావితం చేస్తుంది. దాంతో శారీరక సాన్నిహిత్యం తగ్గి మరింత దూరం పెరుగుతుంది.