జనగామ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీకి అప్పగించి స్ఫూర్తిగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మి(90) మంగళవారం మృతిచెందారు. మృతురాలి కుమారుడు దేవేందర్‌తోపాటు కూతుర్లు, మనుమలు పెద్ద మనసు చేసుకుని లక్ష్మి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించేందుకు ముం దుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ నేత్ర అవయవ శరీ ర దాతల అసోసియేషన్ వరంగల్ వారు అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని జనగామ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. మెడిసిన్ అసో సియేట్ ప్రొఫెసర్, రిటైర్డ్ కర్నల్ డాక్ట ర్ మాచర్ల భిక్షపతి సమక్షంలో జనగామ మెడికల్ కాలేజీకి అప్పగిం చారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి, సలహాదారులు ఆడెపు రాజేంద్రప్రసాద్, దళపతి, తాటిపల్లి జనార్థన్‌రెడ్డి, కురుషద్ పాషా, సేవాసదనం తదితరులు పాల్గొన్నారు.