11-02-2025 12:43:31 AM
నిజాంసాగర్ ఫిబ్రవరి 10 (విజయ కాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో ఆదివారం నాడు ప్రమాదవశాత్తు జారిపడిన ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విట్టల్ నీటి ఉధృతికి కొట్టుకుపోగా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం చీకటి పడినా కూడా శవం లభ్యం కాలేదు. సోమవారం రోజు ప్రొద్దున గజ ఈతగాళ్ల సహాయంతో వెతకగా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్ 3 వద్ద మృత దేహం లభ్యమైనట్లు తెలిపారు, మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.