కడ్తాల్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగో పాలస్వామి కళ్యాణం ఆలయ ధర్మకర్త వింజమూరి రామానుజాచార్యుల ఆధ్వ ర్యంలో మంగళవారం వైభవంగా జరిగిం ది. స్వామివారి కల్యాణానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.
ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. అనంతరం విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మాజీ సర్పంచ్ సులోచన సాయిలు, నాయకులు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.