రేసులో ఐదుగురు
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుని పేరును అధిష్టానం ఆదివారం ప్రకటించ నుంది. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కేంద్ర హశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించిన వారికే అవకాశం దక్కనుంది. అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకున్నా రు.
ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గంగా డి కష్ణారెడ్డి, కరీంనగర్ పార్లమెంటరీ నియో జకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, సీనియర్ నాయకుడు కొట్టె మురళి, ఆర్‌ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రస్తుత ఉపాధ్య క్షుడు వాసుదేవరెడ్డి, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ లు రేసులో ఉన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కష్ణారెడ్డి గత నాలుగున్నర సంవత్సరాలుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నందున ఆయన ను కొనసాగించకపోవచ్చు. అయితే పోటీ ఎక్కువ ఉన్నందున రెండవసారి అవకాశం కల్పించిన ఆశ్చర్యం లేదు. పోటీ పడుతున్న వారంతా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలలో పనిచేసి ప్రస్తుతం పార్టీకి సేవ చేస్తున్నవారే కావడం తో ఆచితూచి ఎంపిక చేసే అవకాశం ఉంది.
కేంద్ర ెంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచించిన వారికే అవకాశం దక్కనుంది. ఇదిలా ఉండ గా కరీంనగర్ నగరంలోని సౌత్ కమిటీని మాత్రమే నియమించారు. నార్త్, ఈస్ట్, సెంట్రల్ కమిటీల అధ్యక్షులను నియమించ వలసి ఉంది.
ఈ కమిటీలను కూడా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ప్రకటించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ముందుకు నడిపిం చే నాయకున్ని అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.