14-04-2025 05:49:13 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బిజెపి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని సిపిఐ నాయకులు అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మతతత్వాన్ని రెచ్చగొడుతున్నదని విమర్శించారు. మత ద్వేషాలతో ప్రజలలో అలజడి సృష్టించి ప్రజల ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తున్నది అన్నారు.
దేశంలోనీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, పేదలు నిరుపేదలుగా మారుతున్న పారిశ్రామిక చట్టాలపై దాడి చేస్తూ 44 చట్టాలు ఉండగా నాలుగు కోడ్ లుగా మార్చిందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు పూలబాట వేస్తున్నారని ధ్వజమెత్తారు. తద్వారా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించవలసి ఉన్నదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ కార్యదర్శిఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకులు చెప్ప నరసయ్య బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ క పట్టణ సహాయ కార్య కొంకుల రాజేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పోచం, హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, జిల్లా సమితి సభ్యులు, లింగాల అమృత రత్నం రాజం, దాసరి అనిల్ టౌన్ కార్యవర్గ సభ్యులు, మూల శంకర్ గౌడ్, పుల్లూరు ఉదయ్, బంగారు శంకర్, పుల్లూరు చైతన్య, ప్రకాష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.