06-04-2025 08:11:12 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట..
మద్నూర్ (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఆదివారం జుక్కల్ మండలం కండెబల్లూరు, మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం యొక్క విలువలతో పాటు మహాత్మా గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను దేశ ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట మద్నూర్ మండలం కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.