calender_icon.png 22 April, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే

22-04-2025 01:22:38 AM

  1. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది   

బీఆర్‌ఎస్‌ను నమ్మె పరిస్థితి లేదు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యం..

ఎంపీ రఘునందన్ రావు 

సిద్దిపేట, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పో గా, బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మె పరిస్థితి లేదని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన పదా అధికారుల, మండల అధ్యక్షుల, మండ ల ఇంచార్జిల సమావేశానికి జిల్లా సంఘటన సంరచణ ప్రభారి అయ్యన్నగారి భూమ య్య, ఎంపీ రఘునందన్ రావులు హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి న ప్రజలు సభకు వెళ్లేందుకు సిద్దంగా లేరని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.  ఉపాధ్యాయ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమాన్నారు. తెలంగాణ ప్రజలు భారతీ య జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధమైనట్లు తెలిపారు.

పేద ముస్లింలా సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని ఎన్డీఎ కూటమి వక్ఫ్ చట్టానికి సవరణ చేసిందన్నారు. ఈనె ల 26న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్ జీవో భవన్ లో వక్ఫ్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మేధావులు, ప్రజాస్వామిక వాదులు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ప్రజలు అవగాహన సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

సిద్దిపేట పట్టణంలో రెండు కమిటీలు  

సిద్దిపేట పట్టణ జనాభా, విస్తీర్ణం పెరిగినందున భారతీయ జనతా పార్టీలో రెండు కమిటీలు నియమించాలని పార్టీ ఆదేశాల మేరకు నిర్ణయించినట్లు ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఈనెల 25లోపు మండ ల, బూత్ కమిటీ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా కమిటీల నియామకం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అండగా ఉంటానని రఘు నందన్ రావు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, చొప్పదండి విద్య సాగర్, కే. రాంభూపాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు వంగ రామచంద్రా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.