calender_icon.png 25 October, 2024 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ది బర్త్‌డే బాయ్

15-07-2024 02:04:59 AM

పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ -రవికృష్ణ

నటుడిగా నిలదొక్కుకునే క్రమంలో సీరియల్స్, బిగ్‌బాస్ రూపంలో వచ్చిన అవకా శాలను అందిపుచ్చుకుని ‘విరూపాక్ష’ సిని మాతో గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రవి కృష్ణ.సమీర్ మళ్లా, రాజీవ్ కనకాలతో ఆయన నటించిన ‘ది బర్త్‌డే బాయ్’ చిత్రం జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రవికృష్ణ ఆదివారం పాత్రికేయులతో ముచ్చటించాడు. ఆ వివరాలు.. 

‘విరూపాక్ష’ సమయంలోనే ఈ అవకాశం వచ్చింది. ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు ఒక వాస్తవ ఘటనతో ఈ సిని మా చేస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా కథలంటే నాకు చాలా ఇష్టం. పుట్టినరోజు నాడు జరిగిన ఘటనలో ఓ స్నేహితుడు చనిపోతాడు. మిగిలిన వారు తర్వాత పరిణామాలను ఎలా ఎదుర్కొన్నా రు అనేది కథ. ఇందులో నాది పూర్తిస్థాయి పాత్ర. వాస్తవ ఘటనతో చేసిన ఈ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు చక్కటి బిగువుతో సాగుతుంది. 48 గంటల్లో జరిగే ఈ కథలో కొంత ఫిక్షన్ డ్రామా కూడా ఉంది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే, ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఈ ప్రయాణం సాగిస్తున్నా. ఆ కోవలోనే బిగ్‌బాస్, టీవీ ధారావాహికలు చేశాను. అయితే బిగ్‌బాస్ తరువాత పూర్తిగా సినిమాలపై దృష్టి సారించాను. ‘విరూపాక్ష’ తరువాత సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సినిమాతో పాటు సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం చేస్తున్న ఓ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నా ను. ఇలాగే నెమ్మదిగా మంచి పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు పొందాలి. ‘ది బర్త్‌డే బాయ్’ పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. నలుగురు కుర్రాళ్లు సహజంగా ఎలా ఉంటారో ఈ సినిమా అలా ఉంటుంది. ప్రస్తుతం ‘ఏ1 ఏ2 ఏ3’ అనే సినిమాలో  హీరోగా చేస్తున్నాను. మరికొన్ని సినిమా లు చర్చల దశలో ఉన్నాయి.