14-04-2025 05:46:16 PM
కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు మండలంలో మెయిన్ రోడ్డు సెంటర్ నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన అంబెడ్కర్ కమిటీ. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాబు జై సన్నిధానం ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మేజర్ గ్రామం పంచాయితీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు యాసా శ్రీకాంత్, రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామం పంచాయితీ పారిశుధ్య కార్మికులను మరియు విద్యుత్ శాఖ సిబ్బందిని సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాల్గొని సిబ్బందిని శాలువాలు కప్పి బహుమతులు అందించిన రెవిన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ గౌడ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ అధికారి మాట్లాడుతూ.. ఆర్థిక వేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ రూపకర్త, ఈ శతాబ్దపు మహామేధావి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ అని అన్నారు.
ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోట్లాది బ్రతుకులకు భరోసా చాంపియన్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. మార్కెట్ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ... డాక్టర్ బీర్ అంబెడ్కర్ ఒక్క వెనకబడిన తరగతి వారికే కాదు యావత్ దేశానికీ దిశా నిర్దేశకులుగా ఉన్నారని అయన రాసిన రాజ్యాంగం వల్లనే మహిళా హక్కులు సాదికరామౌతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీర్ అంబెడ్కర్ కమిటీ, మానవ హక్కులు సంఘం, మైనారిటీ సంఘాలు,బీసీ సంఘాలు,యం.ఆర్.పి.యస్ సంఘాలు నాయకులు రామకృష్ణ, ఎంగల వెంకటేశ్వర్లు, నల్లగట్ల కోటేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుమర్తి చందర్ రావు,మండలం కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి, పాపబత్తిని నగేష్, దామల రాజు, భైర్ల కాంతారావు,ఆళ్లకుంట నరసింహారావు,లింగనబోయిన పుల్లారావు, పెద్దబోయిన నరసింహారావు, తోట సుబ్బారావు, బొల్లం ఉపేంద్ర,పుల్లారావు, మండలం, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్యనాయకులు, పంచాయతీ ఈఓ నాగేశ్వరావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.