calender_icon.png 26 November, 2024 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డును నిర్వీర్యం చేసేందుకే బిల్లు

27-08-2024 02:24:20 AM

సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్‌బోర్డు

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అసదుద్దీన్ 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాం తి): దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌బోర్డుల స్వతంత్రను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని తెలంగాణ వక్ఫ్‌బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొ చ్చిన చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించింది. ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరి చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా  వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని మండిపడింది.

వక్ఫ్ సవరణ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. వక్ఫ్‌బోర్డులపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం తగ్గించడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించింది.ఈ బిల్లుతో ముస్లిములను విభజించే ప్రయత్నా న్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. సమావేశంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును మొదటగా తిరస్కరించిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. బిల్లు తిరస్కరణకు మద్దతు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు రేవంత్‌రెడ్డిని అస దుద్దీన్ కలిసి వక్ఫ్‌బోర్డు అంశంపై చర్చించా రు. వక్ఫ్ బోరును నియంత్రించడానికి ప్రభు త్వం  పూనుకోవడం సరికాదన్నారు.  అవినీతిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుదని సూచించారు. హర్యానా, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల్లో మత విభజన సృష్టించి ఓట్లు పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సీఎంను కలిసిన వారిలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ ఖలీద్ సైపుల్లా రెహ్మానీ ఉన్నారు.