05-04-2025 12:47:24 AM
నారాయణపేట. ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు, జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, పట్టణ అధ్యక్షుడు మురళి భట్టాడ్ కోరారు.
శుక్రవారం నారాయణపేట గొడుగుగేరి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9. 45 నిమిషాలకు పళ్ల హనుమాన్ మంది ర్ నుండి పురవీధుల గుండా ర్యాలీ ఉంటుందని బ్రాహ్మణవాడి రామ్ మందిర్ వద్ద ముగిస్తుందని హిం దూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటి విజయవంతం చేయాలని వారు కోరారు.
కా ర్యక్రమంలో పట్ట ణ కార్యదర్శి కడుదాసు ప్రవీణ్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక వడ్ల శ్రావణ్ కుమార్, పట్టణ అధ్యక్షు లు వెంకటేష్, చెన్నారెడ్డి, ఆకాష్, రాఘవేంద్ర,పాల్గొన్నారు.