- అక్కడికక్కడే ముగ్గురు మృతి
- లిఫ్ట్ అడిగిన విద్యార్థి దుర్మరణం
- ఖమ్మం జిల్లా గోవిందాపురంలో విషాదం
భ్రద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1(విజయక్రాంతి): ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టగా, ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గోవిందాపురం వద్ద గురువారం చోటుచేసుకుంది. సత్తుపల్లి మం డలం గోవిందాపురానాకి చెందిన బేతు సురేశ్ (25), ముత్తిని వేణు(18) బైక్‌పై గంగా రం రింగ్‌సెంటర్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. గంగారం పాఠశాలలో చదువుకునే గోవిందాపురానికి చెందిన కరీముల్లా (12) వీరిని లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కాడు.
ముగ్గురు కలిసి వెళ్తుండగా గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని ప్రమాదవశాత్తు వీరు ఢీకొట్టారు. ప్ర మాదంలో బైక్ లారీ కిందకు దూసుకెళ్లి ముగ్గురు తలలు పగిలి తీవ్రగాయాలపాలయ్యా రు. అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని, మృతదేహాలను సత్తుపల్లి దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న మృతుల రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి.