* ఇద్దరు యువకుల మృతి
శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (విజయక్రాంతి): డివైడర్‌ను బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో శుక్రవారం ఉద చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆకాంక్ష్ (24), అతని స్నేహితుడు రఘుబాబుతో కలిసి బోరబండ నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్నాడు.
అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డు వద్ద బుల్లెట్ బైక్‌పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మా హాస్పిట ల్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కే చేసి దర్యాప్తు చేస్తున్నారు.