మల్లూరుగుట్ట అడవుల్లోకి పయనం
సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ములుగు(జనగామ), డిసెంబర్ 11 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో సంచరిస్తున్న పులి జాడ రోజుకో చోట కనిపిస్తున్నది. మంగళవారం వెంకటాపురం మండలం అలువాక బోధపురం ప్రాంతంలో పులి అడుగులను అధికారులు గుర్తించారు. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టగా.. బుధవారం మరో చోట దాని గుర్తులు కనిపిం చాయి. మంగపేట మండలం నిమ్మగూడెం పంచాయతీ పరిధిలోని చౌడువర్రె సమీపంలో ఓ పొలంలో పెద్దపులి అడుగులను అధికారులు గుర్తించారు.
బోధాపురం నుం చి చుంచుపల్లి రేవు మీదుగా మల్లూరుగుట్ట ప్రాంతంలోకి పులి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తిమ్మాపురం అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉండటంతో సమీప అటవీ గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. పశువులను కాసేందుకు అడవిలోకి వెళ్లొదని సూచించా రు. పులి జాడలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేగానీ పులికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని సూచించారు.