calender_icon.png 19 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలకు భూభారతి చట్టమే పరిష్కార మార్గం

18-04-2025 01:45:29 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 17 ( విజయ క్రాంతి ) : భూభారతి చట్టం ద్వారా భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర పరిష్కార మార్గం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు.  గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టంపై ప్రజలకు  అవగాహన సదస్సలో పాల్గొన్న  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి.

ఈ సందర్భంగా డా.బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ , మాట్లాడుతూ.... భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వారి భూమి వారికి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టం గ్రామ గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ భూ సమస్య పై ఒక వ్యక్తి చేసుకున్న దరఖాస్తు దానిలో  కబ్జా మాత్రం సగం సగం పంచుకున్నారని, పట్టా మాత్రం ఇతరుల పేరు మీద నమోదు అయిందని  దాన్ని పరిష్కారం కు గతంలో చట్టం లేనందున కోర్టుకు పంపడం అక్కడ  కూడా కొన్ని సమస్యలు పరిష్కారం.

కాకపోవడం వంటి రకరకాల సమస్యలు ఉండేవని, ఇప్పు డు ధైర్యంగా భూభారతి చట్టం ద్వారా ఇబ్బందులు పోతాయని , భూభారతి అప్పిలేట్ అధికారిగా ఆర్డిఓ ఉంటారని ఏమైనా భూ సమస్యల పై అన్యాయం జరిగితే ఆర్డిఓ సవరించి చట్టం ద్వారా న్యాయం జరిగేలా చేస్తారన్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పోవడానికి ప్రభుత్వం  భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భూధార్ కార్డులు దశల వారిగా అంది స్తుందన్నారు.

గ్రామాలలో  ప్రతి పేదవారికి ఈ చట్టం ద్వారా భూ సమస్య పోవడానికి ఈ చట్టం శాశ్వత చిరునామా అని అన్నారు. ఈ అవగాహన సదస్సులో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, సంబంధిత తహసిల్దార్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.