calender_icon.png 21 April, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలో తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత

13-12-2024 12:54:12 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం

పటాన్‌చెరు, డిసెంబర్ 12: ప్రపంచంలోనే తొలి ధార్మిక గ్రంథం భగవ ద్గీత అని, ప్రతీఒక్కరూ భగవద్గీతను చదవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గీతా జయంతిని  పురస్కరించుకొని పటాన్‌చెరులోని శాంతినగర్ కాలనీ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో విద్యా భారతి పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడెం మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతకు మించిన పాఠం లేదన్నారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, దామోదర్‌రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.