28-03-2025 12:53:01 AM
మెదక్, మార్చి 27(విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి లక్షల్లో అప్పుల పాలయ్యాడు. తీరా ఆ అప్పు చెల్లించాలని తల్లిదండ్రులను వేధించడంతో భరించలేక కన్నతండ్రే హత్య చేశాడు. రామాయంపేట మండలంలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్ల ద్వారా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
వెల్దుర్తి మండలంలో పలువురు యువకులు ఇంట్లో వాళ్ళ కు తెలియకుండా ఆన్ లైన్ గేమ్ల వల్ల అప్పుల పాలై తల్లిదండ్రులను ఇక్కట్ల పాలు చేశారు.. ఆస్తులమ్ముకొని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ గేమ్లు, బెట్టింగుల వల్ల ఎందరో నష్టపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి...
ఆన్లైన్ బెట్టింగ్తో యువత జీవితాలు నాశనమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ భారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. జిల్లాలో సైతం కేసు లు పెరిగిపోతున్నాయి. యువత ఆన్లైన్ గేమ్లపై ఆసక్తి చూపుతూ బెట్టింగ్స్ వరకు వెళ్తున్నారు. ఐపీఎల్ ప్రారంభంతో ఆన్లైన్ బెట్టింగ్కు క్రేజ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దందాగా మలుచుకుంటున్నారు.
యువతతో పాటు ఉద్యోగు లు, విద్యార్థులు బెట్టింగ్ యాప్ల మోజులో పడుతున్నారు. చిన్న వయస్సులోనే ఆర్థిక నష్టాలను చవిచూస్తున్న ఘటనలు జిల్లాలోనూ చోటు చేసుకుంటున్నాయి. పట్టణాల కే పరిమితం కాకుండా ఆయా మండలాల్లో సైతం ఈ భూతం బారిన పడి పలువురు నష్టాల పాలవుతున్నారు. కొంతమంది కూలీనాలి చేసుకునేవారు, ప్రైవేట్ ఉద్యోగులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇందులో పెట్టి ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.
జోరుగా పెరుగుతున్న దందా...
నిషేధిత యాప్ల ద్వారా యువత ఆన్లైన్ బెట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్య లో వ్బుసైట్లు, యాప్లలో ఈ బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. వీటిపై నిషేధం ఉన్న ప్పటికీ యాప్ల ద్వారా లొకేషన్ చేంజ్ చేస్తూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సందర్బంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా సారించాల్సిన అవసరం ఉందని ప లువురు పేర్కొంటున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువ బెట్టింగ్ బారిన పడు తున్నారు.
జట్టులో ఆటగాళ్ల తీరు, మ్యాచ్ గెలిచేదెవరు..ఫోర్, సిక్స్ ఇలా అనేక అంశాలపై వేల రూపాయల్లో బెట్టింగ్ పెడుతు న్నారు. యువకులతో పాటు పలు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. కొంతమంది విద్యార్థులు, యువత తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు సైతం అనుసంధానం చేసి వారిని సమస్యల్లోకి నెట్టుతున్నారు. ఈ క్రేజ్ను దందాగా మలుచుకొని కొంతమంది బెట్టింగ్ యాప్ల ద్వారా జేబులు నింపుకుంటున్నారు.
పోలీసుల ప్రత్యేక నిఘా...
ఆన్లైన్ బెట్టింగులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సీసీఎస్ పోలీసులు సైతం అలాంటి వారిపై కన్నేసి ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆన్లైన్ బె ట్టిం నిషేధం విధించింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు.
బెట్టింగ్లకు దూరంగా ఉండాలి...
ఆన్ లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి. రాష్ట్రంతో దీనిపై నిషేధం అమలులో ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బెట్టిం గ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు. చాలామంది ఈ వ్యసనానికి ఆలవాటుపడి నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. విలువలైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ జరి గితే నేరుగా తమకు సమాచారం అందించాలని, మా ప్రత్యేక బృందాలు కూడా నిఘా పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.
ఉదయ్ కుమార్‌రెడ్డి, ఎస్పీ