calender_icon.png 16 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ టీచర్లు 117 మంది

05-09-2024 01:24:06 AM

  1. జాబితా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  2. 47 మంది టీచర్లు, మిగతావారు అధ్యాపకులు, ప్రొఫెసర్లు
  3. నేడు సీఎం చేతులు మీదుగా అవార్డులు ప్రదానం

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క రించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ (బెస్ట్ టీచర్) అవార్డులను బుధవా రం ప్రకటించింది. మొత్తం 117 అవార్డులను సర్కారు ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 47 మంది ఉపాధ్యాయులకు అవార్డులు రాగా, 12 మంది గెజిటెడ్ హెచ్‌ఎంలు, 23 మంది సూల్ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎల్, పీజీటీలు, 12 మంది ఎస్జీటీ, పీఈటీ, టీజీటీలు ఉన్నారు.

ఇంటర్ విద్యా పరిధిలోని11 మంది ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, 55 మంది యూనివర్సిటీ అధ్యాపకులు, నలుగురు సాంకేతిక విద్యాశాక అధ్యాపకులున్నారు. గురువారం సాయం త్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వీరికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు తదితరులు హాజరుకానున్నారు.