calender_icon.png 11 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలువనిచ్చే కీరా

09-03-2025 12:00:00 AM

మండే ఎండలో శరీరానికి చలువనిచ్చేలా ఏదైనా తింటే బాగుండనిపిస్తోందా? అయితే క్రమం తప్పకుండా కీరా తినండి. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో కీరా తినాలంటారు నిపుణులు. 

* ఎండాకాలంలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

* నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది.

* కీరాను రోజూ సలాడ్స్‌లో భాగం చేసుకోవడం లేదంటే కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగులో ముంచుకుని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

* కీరాను రోజూ తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

* కళ్ల కింద క్యారీ బ్యాగ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరా ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.