22-03-2025 01:09:50 AM
ఎక్కువ విస్తీర్ణం లో సాగు
కల్లూరు, మార్చి 20 :-లాభాలు అధిక మొత్తంలో వస్తుండడంతో కల్లూరు మండల పరిధిలో రైతులు పెద్ద ఎత్తున బంతి పంట సాగుచేస్తున్నారు.మండలంలోని పెద్దకోరుకోండి, చిన్నకోరుకోండి, పేరువంచ తదితర గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణం లో బంతి సాగు చేస్తున్నారు.బంతి సాగు ఖర్చు ఎకరానికి వేలల్లో ఉంటోంది. మార్కెట్లో ధరలు పలికితే ఉద్యాన పంటలలో కెల్లా లాభాల మిన్న గా ఉంటాయని మరీదు వీర మాధవ రావు రైతు తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలు వస్తే పూల తోటలకు గిరాకీ ఎక్కువ. దీంతో సీజన్ ను బట్టి కల్లూరు మండలానికి చెందిన రైతులు బంతిని సాగు చేస్తున్నారు.కూలీల ఖర్చు ఎక్కువ. కానీ సీజన్లో మార్కెట్లో కిలో ధర రూ.200 వరకు పలుకుతున్నదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం ఎంతో బాగు
ప్రస్తుతం కనీస ధర కిలో కు రూ.30 ఉంటే చాలు వేలల్లో ఆదాయం వస్తుందని రైతున్నలు హర్షిస్తున్నారు. పూలు నాటిన రోజు నుండి 40 రోజుల్లో పంట కోతకు వచ్చేస్తుంది.కోతకు వచ్చిన నాటి నుండి వాటికి సస్య రక్షణ పాటిస్తే చాలు క్రమంగా 4 నెలలు పూలు కాస్తునే ఉంటాయి. రూ.1,500పెట్టుబడి తో నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నారు. బంతి సాగు విధానం ఒక్కసారి చూస్తే గతంలో రైతన్నలు సాగు విధానం ఒకే విధంగా చేసేవారు. నేలకు సేంద్రియ సారం చేయడం, భూమిని నాగలి సాయంతో గుల్ల చేయడం, మడక సాయం తో 3 అడుగులు చొప్పున కాలువలు తొలి అందులో నాటేవారు. అలా చేయడం వల్ల ఆశించిన మేర దిగుబడి వచ్చేది కాదు. కాలక్రమేణా నాగలి కనుమరుగై యంత్రాలు వాడకంలోకి రావడంతో మల్చింగ్, డ్రిప్, పాలిహౌస్ విధానం వచ్చి రైతున్నలకు కలుపు, శ్రమ, దిగుబడి బాగా కలిసి వచ్చిం ది. ప్రస్తుతం ఈ నూతన విధానానికి అలవాటు పడ్డారు. దిగుబడి మూడు పువ్వులు ఆరు కాయలు ఇదే క్రమం ఎక్కడ చూసినా పాకింది. రైతున్నలు వ్యవసాయంలో పూల మొక్కలకు ఈ విధానాన్ని అనుసరించారు. కనీస ధర బంతి రూ.15 ఉంటే చాలు వేలల్లో ఆదాయం వస్తుందని రైతున్నలు హర్షిస్తున్నారు. పూలు నాటిన రోజు నుండి 40 రోజులు లెక్కపెడితే చాలు కోతకు వచ్చేస్తాయి.. కోతకు వచ్చిన నాటి నుండి వాటికి సస్య రక్షణ పాటిస్తే చాలు క్రమంగా 4 నెలలు పూలు కొస్తునే ఉంటాయి.
ఎకరాకు లక్ష దాకా ఖర్చు
ఒక 5 కోతలు కోసిన తరువాత సైజులు తగ్గుతాయి. అప్పుడు వీటికి కొద్దిగా రసాయనిక ఎరువులు వాడితే చాలు మళ్ళీ సైజులు పెంచుకోవచ్చు. సాగు విధానానికి ఒక ఎకరాకు సుమారు రూ.50 వేలు నుండి రూ. 100000 వరకు ఖర్చు వస్తుంది. కానీ యాజమాన్య పద్ధతులతో సాగు చేపూలు సాగుకు అనుకూలమైన వాతావరణం శీతాకాలం. కానీ ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా వీటికి కావాల్సిన వాతావరణ స్థితిగతులకు రైతుకు వచ్చిన ఆలోచన బట్టి సాగు చేస్తున్నారు. ధరలు ఉంటే చాలు రైతున్నలకు ఇది ఒక వరం లాంటి పంట అని చెప్పవచ్చు. కలర్ బట్టి ధరలు దూసుకెళ్తున్నాయి. అదే బంతి పసుపు, ఆరెంజ్ ఎక్కువగా మార్కెట్లో కనపడుతాయి.